Satya Nadella: భారీగా పెరిగిన సత్య నాదెళ్ల వేతనం.. ఇప్పుడు ఎంతంటే..?
ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల(Microsoft CEO Satya Nadella) జీతం(salary) భారీగా పెరిగింది
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల(Microsoft CEO Satya Nadella) జీతం(salary) భారీగా పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 664 కోట్ల వేతనం అందుకోనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో అందుకున్న రూ. 447 కోట్లతో పోలిస్తే ఇది 63 శాతం ఎక్కువ. ఆయన సాలరీలో క్యాష్ ఇన్సెంటివ్స్(Cash Incentives) తక్కువ, స్టాక్ అవార్డు(Stock Award)లు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కాగా జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ వృద్ధిలో దూసుకెళ్లింది. కంపెనీ షేర్లు దాదాపు 31.2శాతం మేర లాభపడ్డాయి. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లను క్రాస్ చేసింది. అయితే సత్య నాదెళ్ల శాలరీ పెరిగినప్పటికీ ఆయనకు నగదు ప్రోత్సాహకం మాత్రం హాఫ్ వరకు తగ్గింది. కంపెనీకి సేవలు అందించినందుకు గాను ఈ ఇయర్ నాదెళ్లకు రూ. 43 కోట్ల ఇన్సెంటివ్స్ అందనున్నట్లు కంపెనీ ఫైలింగ్‌లో తెలిపింది. అయితే ఆయనకు రావాల్సిన రూ.86 కోట్ల కంటే ఇది తక్కువ. ఈ ఫైనాన్సియల్ ఇయర్ లో అనేక సైబర్ సెక్యూరిటీ(Cyber security) ఉల్లంఘనల కారణంగా ఆయనకు ఇన్సెంటివ్స్ తగ్గినట్లు తెలుస్తోంది.