SAMSUNG : బంపర్ ఆఫర్ ప్రకటించిన శాంసంగ్

ఎవరిని మోసం చేయకుండా లక్షలు సంపాదించాలనుకుంటున్నారా ?

Update: 2024-08-13 00:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఎవరిని మోసం చేయకుండా లక్షలు సంపాదించాలనుకుంటున్నారా ? అయితే ఈ వార్త మీకోసమే. ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజాలతో ఒకటైనా శాంసంగ్‌ (SAMSUNG) కంపెనీ మీకోసం సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది .మీకు లక్షలు కావాలంటే మీరు చేయాల్సిందల్లా దాని ఆపరేటింగ్‌ సిస్టం (OS)లోని అతిపెద్ద సమస్యను కనిపెట్టడమే. ఈ సమస్య కనిపెడితే కొన్ని లక్షల రూపాయలు మీ సొంతమవుతాయి. మొబైల్‌ సెక్యూరిటీ ప్రోగ్రాంలో భాగంగా శాంసంగ్‌ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. పరికరాలను అన్‌లాక్‌ చేయడం, డేటాను వెలికి తీయడం, అనధికారిక అప్లికేషన్లను ఇన్‌స్టాల్‌ చేయడం వంటి భద్రతాపరమైన లోపాలతోపాటు ఓఎస్‌కు సంబంధించిన సమస్యలను గుర్తించిన వారికి ఈ రివార్డు ఇవ్వనున్నట్టు శాంసంగ్‌ తెలిపింది. మీరు కనిపెట్టిన సమస్య తీవ్రత ఆధారంగా మీకు రివార్డు ఉంటుంది.ఇదే కాక శాంసంగ్‌ హార్డువేర్ సెక్యూరిటీ సిస్టంలోని సరికొత్త నాక్స్‌ వాల్ట్‌ విజయవంతంగా హ్యాక్‌ చేయడం, రిమోట్‌ కోడ్‌ను ఎగ్జిక్యూట్‌ చేయడం ద్వారా కొన్ని మిలియన్‌ డాలర్లు మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే అన్‌లాక్‌ చేయడం, డేటాను దొంగిలించడం, గెలాక్సీ స్టోర్‌ నుంచి కాకుండా ఇతర సోర్సుల నుంచి యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయడం వంటి వాటికి కూడా అవార్డులు ప్రకటించింది.

Tags:    

Similar News