రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ నుంచి భిన్నమైన ఈవీ బైక్

దేశీయ ప్రీమియం బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రత్యేకమైన, పూర్తిగా భిన్నమైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే భారీ పెట్టుబడులతో వాటి ఉత్పత్తిని ప్రారంభించామని, చెన్నైలో ఉన్న కంపెనీ తయారీ ప్లాంటులో

Update: 2023-05-21 13:20 GMT

చెన్నై: దేశీయ ప్రీమియం బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రత్యేకమైన, పూర్తిగా భిన్నమైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే భారీ పెట్టుబడులతో వాటి ఉత్పత్తిని ప్రారంభించామని, చెన్నైలో ఉన్న కంపెనీ తయారీ ప్లాంటులో తగిన మార్పులు ప్రణాళికబద్ధంగా సిద్ధం చేసినట్టు కంపెనీ సీఈఓ బి గోవిందరాజన్ తెలిపారు. ఈవీ తయారీ, ఉత్పత్తి కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ రూ. 1,000 కోట్ల మూలధన నిధులను కలిగి ఉంది. ఈ మొత్తం నుంచే పెట్రోల్ బైకుల అభివృద్ధి కేటాయించామని, ఈవీ మోటార్‌సైకిళ్ల అభివృద్ధికి అత్యంత సమర్థవంతమైన టీమ్ ఏర్పాటు చేసినట్టు గోవిందరాజన్ వివరించారు. వేగంగా పెరుగుతున్న ఈవీ విభాగంలో స్థిరమైన పురోగతిని సాధిసాం. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ కింద ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్పత్తి, టెక్నాలజీ, సరఫరా వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చామని ఆయన వెల్లడించారు.

Also Read...

మేలో రూ. 30 వేలు కోట్లు దాటిన విదేశీ పెట్టుబడులు 

Tags:    

Similar News