Royal Enfield: అదిరిపోయే లుక్‌తో బుల్లెట్ 350 లాంచ్
ప్రముఖ బైక్ తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్లో తన వాటాను మరింత పెంచుకోడానికి కొత్త కొత్త మోడళ్లను లాంచ్ చేస్తుంది
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ బైక్ తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్లో తన వాటాను మరింత పెంచుకోడానికి కొత్త కొత్త మోడళ్లను లాంచ్ చేస్తుంది. తన పాత బుల్లెట్ మోడల్ సెంటిమెంట్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి కొత్తగా ‘బుల్లెట్ 350 బెటాలియన్ బ్లాక్’ ను లాంచ్ చేసింది. దీని లుక్ మొత్తం కూడా చాలా స్టైలీష్‌గా, రైడర్లకు కంఫర్ట్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త దానిలో సీటింగ్ మార్చారు. దీని ధర రూ.1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
ఇంజన్-ఫీచర్లు: ‘బుల్లెట్ 350 బెటాలియన్ బ్లాక్’ 349 cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంది. 6,100 rpm వద్ద 20.2 hp పవర్, 4,000 rpm వద్ద 27 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించారు. బ్రేకింగ్ కోసం సింగిల్ ఛానల్ ABSతో 300 mm ఫ్రంట్ డిస్క్, వెనుక 153 mm డ్రమ్ బ్రేక్‌ను అమర్చారు. హెడ్‌ల్యాంప్ యూనిట్, సస్పెన్షన్, టర్న్ సిగ్నల్స్, హ్యాండిల్‌బార్‌పై క్రోమ్ యాక్సెంట్‌లను కలిగి ఉంది. పెట్రోల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్‌పై 3డి బ్యాడ్జింగ్‌ను అందించారు. ఈ మోడల్ హోండా CB350, జావా 350కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.