Mukesh Ambani: రెండేళ్లుగా జీతం తీసుకోని ముఖేశ్ అంబానీ!
Mukesh Ambani did not take Salary for Second Consecutive Year due to Corona Pandemic| దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ వరుసగా రెండేళ్ల పాటు జీతం తీసుకోలేదని సంస్థ తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన వేతనం సున్నాగా ఉన్నట్టు సంస్థ తన వార్షిక నివేదికలో
న్యూఢిల్లీ: Mukesh Ambani did not take Salary for Second Consecutive Year due to Corona Pandemic| దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ వరుసగా రెండేళ్ల పాటు జీతం తీసుకోలేదని సంస్థ తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన వేతనం సున్నాగా ఉన్నట్టు సంస్థ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారాలతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం తో ముఖేశ్ అంబానీ స్వచ్ఛందంగా తన వేతనాన్ని తీసుకోకూడదని నిర్ణయించినట్టు చెప్పారు. దీంతో 2020-21తో పాటు గత ఆర్థిక సంవత్సరంలోనూ ఆయన జీతాన్ని వదులుకున్నారు.
వరుస రెండు ఆర్థిక సంవత్సరాల్లో ముఖేశ్ అంబానీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎలాంటి అలవెన్సులు, ముందస్తు ఖర్చులు, కమీషన్లు, స్టాక్ ఆప్షన్లు, ఇతర ప్రయోజనాలను తీసుకోలేదు. అంతకుముందు 2019-20లో మాత్రమే ఆయన రూ. 15 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. అంతకుముందు 2008-09 నుంచి 11 ఏళ్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ హోదాలో ముఖేశ్ అంబానీ జీతంతో పాటు కమీషన్లు, ఇతర భత్యాలను కలిపి రూ. 15 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారు. దీనివల్ల ఆయన ప్రతి ఏటా సుమారు రూ. 24 కోట్లను వదులుకుంటున్నారు.
ఇక, ముఖేశ్ అంబానీ బంధువుల్లో రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉన్న నిఖిల్, హీతల్ మెస్వానీలు తమ వేతనాలను అంతకుముందు లాగే రూ. 24 కోట్లు మాత్రమే తీసుకున్నారు. ఇందులో రూ. 17.28 కోట్లను కమీషన్ రూపంలో అందుకున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న పీఎంఎస్ ప్రసాద్ అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రూ. 11.99 కోట్ల కంటే తక్కువగా 2021-22లో రూ. 11.89 కోట్లను పొందారు. అలాగే, ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో అంతకుముందు మాదిరిగానే రూ. 2 కోట్ల కమీషన్, రూ. 5 లక్షల సిట్టింగ్ ఫీజును పొందారు.
ఇది కూడా చదవండి: రుణ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్!