Honda Unicorn 2025: హోండా నుంచి కొత్త యూనికార్న్ ఎడిషన్ లాంచ్.. ధర రూ. 1.19 లక్షలు..!
జపాన్(Japan)కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హోండా(Honda) ఇటీవలే యాక్టివా 125, హోండా SP125, SP160 మోడళ్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: జపాన్(Japan)కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హోండా(Honda) ఇటీవలే యాక్టివా 125, హోండా SP125, SP160 మోడళ్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆ సంస్థ తాజాగా కొత్త యూనికార్న్-2025(Unicorn-2025) ఎడిషన్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ ధరను రూ. 1,19,481(Ex-Showroom)గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుత మార్కెట్లో ఉన్న మోడల్ తో కంపేర్(Compare) చేస్తే దీని ధర రూ. 8,000 అధికంగా ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. దీన్ని 162.71cc సింగిల్ సిలిండెర్ ఇంజిన్ తో తీసుకొచ్చారు. ఇది 13 bhp పవర్, 14.58 Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఓబీడీ2బీ కంప్లియంట్ ఇంజిన్, అదనపు ఫీచర్లతో ఈ మోటారు సైకిల్ అప్ డేట్ చేశారు. అలాగే 5-స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్‌తో ఇచ్చారు. ఇక LED హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎకోమోడ్ ఇండికేటర్, గేర్ పొజిషన్, సర్వీస్ అలర్ట్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, రేడియంట్ రెడ్ మెటాలిక్ అనే మూడు కలర్స్‌లలో లభిస్తుంది.