150 కి.మీ రేంజ్‌తో కొత్త ఈవీ బైక్ విడుదల చేసిన రివోల్ట్
ఒకసారి ఛార్జింగ్ చేసిన తర్వాత ఎకో మోడ్‌లో 150 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 3 గంటల్లో బ్యాటరీని 0-75 శాతం ఛార్జ్ చేస్తుంది
దిశ, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బైకుల తయారీ కంపెనీ రివోల్ట్ మోటార్స్ భారత మార్కెట్లో తన కొత్త రివోల్ట్ ఆర్‌వీ 400 బీఆర్‌జెడ్ ఈవీని విడుదల చేసింది. దీని ధర రూ. 1.38 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభించామని, కంపెనీ అధికారిక వెబ్‌సైట్, రివోల్ట్ షోరూమ్‌ల వద్ద కస్టమర్లు బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపింది. రివోల్ట్ కొత్త ఈవీ ఇప్పటికే ఉన్న ఆర్‌వీ 400 మాదిరిగానే డిజైన్ కలిగి ఉంది. అయితే, ముందు బైక్ కంటే సమర్థవంతమైన 3.24 కిలోవాట్ అవర్ లిథియం బ్యాటరీతో వస్తుందని కంపెనీ పేర్కొంది. ఎలిప్స్ రెడ్, కాస్మిట్ బ్లాక్, మిస్ట్ గ్రే, ఇండియా బ్లూ, స్టెల్త్ బ్లాక్, లైటింగ్ ఎల్లో వంటి రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ బైక్ ఒకసారి ఛార్జింగ్ చేసిన తర్వాత ఎకో మోడ్‌లో 150 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కేవలం 3 గంటల్లో బ్యాటరీని 0 నుండి 75 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని, పూర్తి ఛార్జ్‌కు 4.50 గంటలు అవసరమని పేర్కొంది. నార్మల్ మోడ్‌లో 100 కిలోమీటర్లు(టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు), స్పోర్ట్స్ మోడ్ 80 కిలోమీటర్లు(టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు) సదుపాయం కల్పించారు. ఫీచర్ల పరంగా, ఆర్‌వీ400 బీఆర్‌జెడ్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనో-షాక్ రియర్ సస్పెన్షన్, ఆల్-ఎల్ఈడీ లైటింగ్, స్పీడ్, బ్యాటరీ లెవల్, రైడింగ్ మోడ్, టెంపరేచర్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని చూపించే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది.