Realme 14x 5G: అదిరిపోయే ఫీచర్లతో రియల్‌మీ నుంచి 14ఎక్స్ 5జీ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..!
చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) కొత్త వేరియంట్ మొబైల్(New Mobile)ను లాంచ్ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ(Realme) కొత్త వేరియంట్ మొబైల్(New Mobile)ను లాంచ్ చేసింది. రియల్‌మీ 14ఎక్స్ 5జీ(14x 5G) పేరుతో దీన్ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 6 జీబీ+128జీబీ వేరియంట్ ధరను రూ. 14,999గా, 8 జీబీ+128 జీబీ వేరియంట్ ధరను రూ.15,999గా కంపెనీ నిర్ణయించింది. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌తో పాటు రిటైల్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయొచ్చు. క్రిస్టల్ బ్లాక్, గోల్డెన్ గ్లో, జువెల్ రెడ్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.
రియల్‌మీ 14ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్ వివరాలు..
- 6.67 ఇంచెస్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
- మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో పని చేస్తుంది.
- 120Hz రిఫ్రెష్ రేట్ + 625 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఇస్తుంది.
- ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0తో దీన్ని తీసుకొచ్చారు.
- ఇక బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 8 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.
- 45w సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్టుతో 6,000mah బ్యాటరీని కలిగి ఉంది.
- IP69 రేటింగ్, సోనిక్‌వేవ్ వాటర్ ఇజెక్షన్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.