రెపో రేటు మార్పు పై ఆర్బీఐ కీలక నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) శుక్రవారం రెపో రేటు మార్పు పై కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2023-10-06 04:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) శుక్రవారం రెపో రేటు మార్పు పై కీలక నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం ఉన్న 6.5 శాతం రెపో రేటులో ఎటువంటి మార్పు చేయడం లేదని.. తెలిపింది. కాగా సెంట్రల్ బ్యాంక్ బేసిక్ రేటును యథాతథంగా ఉంచడం ఇది నాలుగోసారి. రెపో రేటును అదే స్థాయిలో కొనసాగించేందుకు ఎంపీసీ ఏకగ్రీవంగా ఓటేసినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. కాగా రెపో రేటును యథాతథంగా కొనసాగించాలన్న ఎంపీసీ నిర్ణయం గృహరుణాలు, ఈఎంఐలు కడుతున్న వారికి గుడ్ న్యూస్ గా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్దిరేటు అంచనాలను ఆర్బీఐ 6.5 శాతంగా పేర్కొంది. సెప్టెంబర్ 29 నాటికి దేశ విదేశీ మారక నిల్వలు 586.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉందని వచ్చే ఏడాదికి 5.2 శాతానికి తగ్గొచ్చని శక్తికాంత దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులు, ఇంధన ధరలు అకస్మాత్తుగా పెరిగితే పరిస్థితులను చక్కదిద్దేందుకు సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News