అనంత్ అంబానీ-రాధికలను ఆశీర్వదించిన ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : పలు డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ముంబైకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం రాత్రి 8.30 గంటలకు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : పలు డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ముంబైకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం రాత్రి 8.30 గంటలకు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సాదర స్వాగతం పలికారు. అనంతరం తన వెంట ప్రధాని మోడీని ‘శుభ్ ఆశీర్వాద్’ కార్యక్రమ ప్రధాన వేదిక దాకా ముకేశ్ అంబానీ తీసుకెళ్లారు. ఈ వేదికపైకి చేరుకున్న ప్రధాని మోడీ.. వివాహ బంధంతో ఒక్కటైన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ దంపతులను ఆశీర్వదించారు. వారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా తమ కోడలు రాధికా మర్చంట్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను మోడీకి ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు పరిచయం చేశారు. బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ సహా పలువురు విదేశీ ప్రముఖులు అక్కడ మోడీని కలిసి ముచ్చటించారు. అనంతరం ప్రధాని మోడీ అక్కడే డిన్నర్ చేసి బయలుదేరారు.
హాజరైన ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు వీరే..
అనంత్-రాధిక శుభ్ ఆశీర్వాద్ వేడుకకు పలువురు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు హాజరయ్యారు. ఈ జాబితాలో స్వామి సదానంద సరస్వతి(శంకరాచార్య, ద్వారక), స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి(శంకరాచార్య, జోషిమఠ్), గౌరంగ్ దాస్ ప్రభు (డివిజనల్ డైరెక్టర్, ఇస్కాన్), గౌర్ గోపాల్ దాస్(సన్యాసి, ఇస్కాన్), రాధానాథ్ స్వామి (ఇస్కాన్ పాలకమండలి సభ్యుడు), రమేష్ భాయ్ ఓజా, గౌతంభాయ్ ఓజా, దేవప్రసాద్ మహారాజ్, విజుబెన్ రజనీ (శ్రీ ఆనందభావ సేవా సంస్థ), శ్రీ బాలక్ యోగేశ్వరదాస్ జీ మహారాజ్ (బద్రీనాథ్ ధామ్), చిదానంద సరస్వతి (పరమార్థ నికేతన్ ఆశ్రమం అధిపతి), శ్రీ నమ్రముని మహారాజ్( జైన ముని, పారస్ ధామ్ స్థాపకుడు), ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ ధామ్), బాబా రామ్‌దేవ్ (యోగా గురువు), స్వామి రామభద్రాచార్య , స్వామి కైలాసానంద (నిరంజని అఖారా), మహామండలేశ్వర్ (నిరంజని అఖారా), అవదేశానంద గిరి(జునా అఖారా), మహామండలేశ్వర్ (జునా అఖారా), శ్రీ దేవకినందన్ ఠాకూర్జీ మహారాజ్ (విశ్వ శాంతి సేవా ట్రస్ట్), దీదీ మా సాధ్వి రితంభరా జీ(వాత్సల్య గ్రామ్), శ్రీ విశాల్ రాకేష్ జీ గోస్వామి(ప్రధాన పూజారి, శ్రీనాథ్‌జీ ఆలయం) ఉన్నారు.