ఆదాయంలో పుంజుకున్న Paytm

ఫిన్‌టెక్ దిగ్గజం Paytm(One97 కమ్యూనికేషన్స్) తాజాగా తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

Update: 2023-10-20 16:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫిన్‌టెక్ దిగ్గజం Paytm(One97 కమ్యూనికేషన్స్) తాజాగా తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ 2023-24 ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం రూ.2518.6 కోట్లకు చేరుకున్నట్లుగా పేర్కొంది. ఇది గత ఏడాది ఇదే సమయంలో రూ.1914 కోట్లుగా ఉంది. అలాగే, సమీక్ష కాలంలో నికర నష్టం రూ.290.05 కోట్లుగా నమోదైంది, ఇది గత ఏడాది రూ.571 కోట్లతో పోలిస్తే దాదాపు సగం వరకు తగ్గింది. రుణాల మంజూరు కూడా సంవత్సరానికి 122% పెరిగి రూ.16,211 కోట్లకు చేరుకున్నాయి. కంపెనీ వద్ద నగదు నిల్వలు రూ.8,754 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో, కొత్తగా 14 లక్షల మంది వ్యాపారులు చేరడం ద్వారా మొత్తం సభ్యత్వాలు 92 లక్షలకు చేరుకున్నాయి. ఆర్థిక సేవలు, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 64% పెరిగి రూ.571 కోట్లకు చేరుకుంది.

Tags:    

Similar News