TRAI: 2.75 లక్షల యూఆర్ఎల్‌లను వైట్‌లిస్ట్ జాబితాలో చేర్చిన కంపెనీలు

10 వేల కంపెనీలు 2.75 లక్షల యూఆర్ఎల్‌లను వైట్‌లిస్ట్ జాబితాలో చేర్చాయని ట్రాయ్ బుధవారం ప్రకటనలో తెలిపింది.

Update: 2024-10-15 18:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: సైబర్ మోసాలను అరికట్టేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇటీవల వివిధ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని అనుసరించి ఆగష్టులో వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 10 వేల కంపెనీలు 2.75 లక్షల యూఆర్ఎల్‌లను వైట్‌లిస్ట్ జాబితాలో చేర్చాయని ట్రాయ్ బుధవారం ప్రకటనలో తెలిపింది. యూఆర్ఎల్‌ను వైట్‌లిస్ట్ చేయడం అనేది సరైన ఆమోదం ద్వారా వాటి వల్ల వినియోగదారులకు ఎలాంటి సైబర్ ప్రమాదం లేదని సూచించే జాబితా. వైట్‌లిస్ట్ చేసిన యూఆర్ఎల్‌లు, ఏపీకేలు, ఓటీటీ లింక్‌లు ఉన్న మెసేజ్‌లు కంపెనీలు తమ వినియోగదారులకు పంపొద్దని ట్రాయ్ గతంలో స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. వైట్‌లిస్ట్ చేయకపోతే లింక్‌లను యాక్సెస్ చేసిన కస్టమర్లు మాల్‌వేర్, ఫిషింగ్, హ్యాకర్‌ల బారిన పడే అవకాశం ఉంది. వైట్‌లిస్ట్ చేయడం వల్ల కస్టమర్ల పరికరాలు, డేటాను రక్షించేందుకు వీలవుతుంది. స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు ట్రాయ్ కఠినమైన చర్యలు తీసుకుంటోంది. 

Tags:    

Similar News