న్యాయం చేయాలంటూ.. గూగుల్ సీఈఓకు తొలగించిన ఉద్యోగుల బహిరంగ లేఖ
ఇటీవల గూగుల్ సంస్థ తొలగించిన ఉద్యోగులు, కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్‌కు బహిరంగ లేఖ రాశారు.
కాలిఫోర్నియా: ఇటీవల గూగుల్ సంస్థ తొలగించిన ఉద్యోగులు, కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్‌కు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో మొత్తం 1,400 మంది ఉద్యోగులు సంతకం చేశారు. బహిరంగ లేఖలో.. కొత్త నియామకాలను స్తంభింపచేయడం, బలవంతంగా ఉద్యోగులను తొలగించడం కాకుండా స్వచ్ఛందగా తప్పుకోవాలని కోరడం, ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో తొలగించబడిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే, నిర్ణీత కాలం వరకు ఉద్యోగులను తొలగించకుండా ఉండటం వంటి మొదలైన డిమాండ్లను కంపెనీ సీఈఓ ముందుంచారు. అలాగే, సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్ వంటి దేశాలకు చెందిన ఉద్యోగులను తొలగించకూడదని, ఉద్యోగాలతో పాటు వీసా-లింక్డ్ రెసిడెన్సీని కోల్పోయే ప్రమాదం ఉన్నవారికి ఆదుకోవాలని వారు కోరారు.
Also Read..