NTPC Green Energy: ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీకి సెబీ గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ..!

ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లోకి ప్రవేశించేందుకు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-29 11:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లోకి ప్రవేశించేందుకు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణ కోసం సంస్థలు లైన్ కడుతున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ దిగ్గజం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ(NTPC Green Energy) కూడా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి వచ్చేందుకు సిద్దమైంది. సెప్టెంబర్ 18న ఐపీఓ కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) వద్ద ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దరఖాస్తు చేసుకోగా తాజాగా గ్రీన్ సిగ్నల్ లభించింది.

ఐపీవో ద్వారా సుమారు రూ. 10,000 కోట్లను ఆ సంస్థ సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సబ్‌స్క్రిప్షన్‌ తేదీ, లాట్ సైజ్, షేర్ల ధర లాంటి వివరాలను కంపెనీ వచ్చే వారం ప్రకటించనుంది. కాగా సబ్‌స్క్రిప్షన్‌ లో కంపెనీ ఉద్యోగులకు స్పెషల్ రిజర్వేషన్(Special Reservation)తో పాటు డిస్కౌంట్(Discount) ఉంటుందని ఎన్టీపీసీ తెలిపింది. అయితే ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 7500 కోట్లను సంస్థ అభివృద్ధికి, మిగతా నిధులను లోన్స్ కట్టేందుకు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. 

Tags:    

Similar News