రైలు ప్రయాణికుల కోసం కొత్త క్రెడిట్ కార్డు.. బుకింగ్‌‌లపై భారీ తగ్గింపులు, డిస్కౌంట్లు

ఎక్కువగా రైలు ప్రయాణాలు చేసేవారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC), HDFC బ్యాంక్ రెండు కలిపి కొత్తగా ఒక క్రెడిట్ కార్డును తీసుకొచ్చాయి.

Update: 2023-03-01 15:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎక్కువగా రైలు ప్రయాణాలు చేసేవారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC), HDFC బ్యాంక్ రెండు కలిపి కొత్తగా ఒక క్రెడిట్ కార్డును తీసుకొచ్చాయి. ఇది రెండు సంస్థల కో-బ్రాండెడ్ ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌. రూపే నెట్‌వర్క్‌ ఆధారంగా పనిచేస్తుంది. IRCTC వెబ్‌సైట్, యాప్‌లో రైలు టిక్కెట్ల బుకింగ్‌లను ఈ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, టిక్కెట్ చార్జీలపై డిస్కౌంట్లు లభిస్తాయి. ఈ కార్డును తీసుకోవాలనుకునే వారు IRCTC వెబ్‌సైట్ లేదా HDFC బ్యాంక్ బ్రాంచ్/వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.


IRCTC- HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు

* వెల్‌కమ్ ఆఫర్ కింద రూ. 500 అమెజాన్ వోచర్.

* IRCTC వెబ్‌సైట్/యాప్‌లో టిక్కెట్ బుకింగ్‌లపై ప్రతి రూ.100కి 5 రివార్డ్ పాయింట్స్.

* Smart Buy ద్వారా బుకింగ్‌పై 5% క్యాష్‌బ్యాక్.

* సంవత్సరానికి 8 కాంప్లిమెంటరీ IRCTC రైల్వే లాంజ్ యాక్సెస్.

* AC టికెట్ బుకింగ్‌పై అదనంగా రివార్డ్ పాయింట్స్.

* కార్డ్ జారీ చేసిన 30 రోజులలోపు కార్డ్ యాక్టివేషన్‌పై రూ. 500 వెల్‌కమ్ గిఫ్ట్ వోచర్.

* కార్డు జారీ అయిన 90 రోజుల్లోపు రూ. 30,000 ఖర్చు చేస్తే రూ. 500 విలువైన గిఫ్ట్ వోచర్.

* ప్రతి రూ.100 ల కొనుగోలుపై 1 రివార్డ్ పాయింట్( గమనిక: ఫ్యూయల్, వాలెట్ రీలోడ్ లావాదేవీలు, అద్దె చెల్లింపులు, ప్రభుత్వ సంబంధిత లావాదేవీలకు ఇది వర్తించదు)

* IRCTC వెబ్‌సైట్, యాప్‌లో లావాదేవీ ఛార్జీలపై 1 శాతం మినహాయింపు.



Tags:    

Similar News