యూబీఎస్, క్రెడిట్ స్వీస్ విలీనం వల్ల 36 వేల ఉద్యోగాల కోత!
దివాలా అంచున ఉన్న స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ బ్యాంక్ క్రెడిట్ సూయిజ్‌ను 1 బిలియన్ డాలర్లకు... More Layoffs! UBS-Credit Suisse merger may result in elimination of 36,000 roles
జెనీవా: దివాలా అంచున ఉన్న స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ బ్యాంక్ క్రెడిట్ సూయిజ్‌ను 1 బిలియన్ డాలర్లకు మరో బ్యాంకు యూబీఎస్ గ్రూప్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరు బ్యాంకుల విలీనం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 36,000 మంది ఉద్యోగులను తొలగించవచ్చని ఓ నివేదిక తెలిపింది. స్విస్‌కు చెందిన సాన్‌టాగ్స్ జీటంగ్ పత్రిక ప్రకారం, స్విట్జర్లాండ్‌లోని రెండు అతిపెద్ద బ్యాంకులు యూబీఎస్, క్రెడిట్ స్వీస్ మధ్య విలీనంతో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులను మరింత పెరగకుండా సత్వరం స్పందించిన స్విస్ ప్రభుత్వం గతనెల 18న క్రెడిట్ స్వీస్‌ను యూబీఎస్ కొనేలా చర్యలు తీసుకుంది. అప్పటికే అమెరికా బ్యాంకులు సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉండటం, మాంద్యం భయాలు పెరగడంతో స్విస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇరు బ్యాంకుల విలీనం వల్ల ఏర్పడే సవాళ్లను అధిగమించేందుకు యూఎస్ మొత్తం ఉద్యోగుల్లో 20-30 శాతం మందిని తొలగించాలని భావిస్తోంది. దానివల్ల 25,000 నుంచి 30,000 మంది ప్రభావితం కానున్నారు. అందులో 11 వేల ఉద్యోగాల కోత ఒక్క స్విట్జర్లాండ్‌లోనే ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది. విలీనానికి ముందు యూఎస్, క్రెడిట్ స్వీస్ సంయుక్తంగా 1,22,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్నాయి. ఇటీవలే యూఎస్ ఛైర్మన్ కోల్మ్ కెలెహర్ విలీనం వల్ల గణనీయమైన నష్టం ఉంటుందని చెప్పారు.