Microsoft: భారత్ లో మైక్రోసాఫ్ట్ 3 బిలియన్ డాలర్ల పెట్టుడులు

మైక్రోసాఫ్ట్(Microsoft)) ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల(Satya Nadella) కీలక ప్రకటన చేశారు. దేశంలో క్లౌడ్, ఏఐ(AI) మౌలిక సదుపాయాల విస్తరణ కోసం 3 బిలియన్ డాలర్లు(USD 3 billion) పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటన చేసింది.

Update: 2025-01-07 10:22 GMT

దిశ, బిజినెస్: మైక్రోసాఫ్ట్(Microsoft)) ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల(Satya Nadella) కీలక ప్రకటన చేశారు. దేశంలో క్లౌడ్, ఏఐ(AI) మౌలిక సదుపాయాల విస్తరణ కోసం 3 బిలియన్ డాలర్లు(USD 3 billion) పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటన చేసింది. అలాగే, 2030 నాటికి 10 మిలియన్ల మందికి ఏఐ నైపుణ్యాల గురించి శిక్షణ ఇవ్వనున్నట్లు సత్యనాదెళ్ల వెల్లడించారు. బెంగళూరు వేదికగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. ఎప్పుడూ లేని స్థాయిలో భారత్‌లో 3 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెడుతున్నందుకు సంతోషంగా ఉందని సత్య నాదెళ్ల తెలిపారు. ఈ పెట్టుబడి భారత్‌లో ఏఐ ఆవిష్కరణలకు ఇది తోడ్పాటు అందిస్తుందని వెల్లడించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఆలోచనల్లో కీలక భూమిక పోషిస్తుందన్నారు.

సాధికారిత కల్పించాలనే లక్ష్యం

భారతదేశంలోని ప్రతి వ్యక్తి, సంస్థకు సాధికారత కల్పించాలనేది మైక్రోసాఫ్ట్ లక్ష్యమని సత్య నాదెళ్ల అన్నారు. భవిష్యత్‌లో ఏఐ నిపుణుల అవసరం పెద్ద సంఖ్యలో ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో భారతీయ నిపుణులు ముందుంటారని కొనియాడారు. అందుకే, 2025 నాటికి 2 మిలియన్ల మందిని ఏఐ నిపుణులగా తీర్చిదిద్దే ఉద్దేశంతో గతంలో ‘అడ్వాంటేజ్‌ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. గడువు కన్నా ముందే ఆ లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. అదే కార్యక్రమం కింద 2030 నాటికి 10 మలియన్ల మందికి ఏఐ స్కిల్స్‌ అందించాలని లక్ష్యమని సత్యనాదెళ్ల తెలిపారు.

Tags:    

Similar News