అదానీ షేర్లలో రూ. 15,446 కోట్ల పెట్టుబడులు పెట్టిన అమెరికా కంపెనీ!

హిండెన్‌బర్గ్ నివేదిక దెబ్బకు లక్షలాది కోట్లు కోల్పోయిన అదానీ కంపెనీల షేర్లలో భారీ పెట్టుబడులు వచ్చి చేరాయి.

Update: 2023-03-02 16:56 GMT

ముంబై: హిండెన్‌బర్గ్ నివేదిక దెబ్బకు లక్షలాది కోట్లు కోల్పోయిన అదానీ కంపెనీల షేర్లలో భారీ పెట్టుబడులు వచ్చి చేరాయి. అదానీ గ్రూప్‌లోని అదానీ పోర్త్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీల్లో అమెరికాకు చెందిన గ్లోబల్ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ జీక్యూజీ పార్ట్‌నర్స్ రూ. 15,446 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. ఈ మేరకు అదానీ గ్రూప్ గురువారం అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

ఈ కొనుగోలు బ్లాక్ డీల్స్ రూపంలో జరిగినట్లు తెలిపింది. ఈ పెట్టుబడి తో భారత మౌలిక సదుపాయాల అభివృద్ధి, వృద్ధిలో జీక్యూజీ కీలక పెట్టుబడిదారుగా మారిందని అదానీ గ్రూప్ వెల్లడించింది. తాము పెట్టుబడి పెట్టిన అదానీ కంపెనీలకు దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు గణనీయంగా ఉన్నాయని నమ్ముతున్నట్టు జీక్యూజీ పార్ట్‌నర్స్ ఛైర్మన్, చీఫ్ ఇన్వెస్ట్‌మెట్ ఆఫీసర్ రాజీవ్ జైన్ అన్నారు.

దీర్ఘకాలంలో ఇంధన పరివర్తనతో సహా భారత ఆర్థిక వ్యవస్థ, ఇంధన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో సహాయపడే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News