కేవలం 3 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకునే హైబ్రిడ్ సూపర్ కార్

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెక్‌లారెన్ భారత మార్కెట్లో తన కొత్త హైబ్రిడ్ మోడల్‌ను విడుదల చేసింది.

Update: 2023-05-26 15:16 GMT

న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెక్‌లారెన్ భారత మార్కెట్లో తన కొత్త హైబ్రిడ్ మోడల్‌ను విడుదల చేసింది. 'ఆర్టురా' పేరుతో తీసుకొచ్చిన ఈ కారు తాము ఉత్పత్తి చేసిన మొదటి హైబ్రిడ్ లగ్జరీ కారు అని, భారత మార్కెట్లో దీని ధరను రూ. 5.1 కోట్లు నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

3.0 లీటర్ల ట్విన్-టర్బో హైబ్రిడ్ వీ6 పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే ఈ మోడల్ 8-స్పీడ్ ఆటో ట్రాన్స్‌మిషన్‌తో 330 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం మూడు సెకన్లలో 0-100 కిలోమీటర్ల స్పీడ్‌ను, 8.3 సెకన్లలో 0-200 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుందని కంపెనీ పేర్కొంది.

ఫీచర్లకు సంబంధించి కారులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ టెక్నాలజీతో పాటు ఈ-మోడ్, కంఫర్ట్, స్పోర్ట్, ట్రాక్ వంటి నాలుగు డ్రైవింగ్ మోడ్‌లలో వస్తుంది. ట్రాక్ మోడ్‌లో హైబ్రిడ్ పవర్‌తో తక్కువ సమయంలో స్పీడ్‌ని అందుకుంటుందని, దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఏడాదిలో మెరుగైన ఆదరణ పొందామని, వినియోగదారులకు మెరుగైన సేవలు, ఎక్స్‌పీరియన్స్ అందించే లక్ష్యంతో కార్లను తీసుకొస్తామని మెక్‌లారెన్ ఆటోమోటివ్ ఎండీ పాల్ హారిస్ చెప్పారు.

Tags:    

Similar News