నవంబరు 2: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.
దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. కాగా నవంబరు 1న ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా పలు చోట్ల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను 100 రూపాయలకు పైగా పెంచాయి. దీంతో.. ఎల్‌పీజీ వాణిజ్య సిలిండర్ ధర ఢీల్లీలో 1833 రూపాయలకు చేరుకుంది. కాగా గత రెండు నెలల్లో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవల చాలా రోజుల తర్వాత గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి సామాన్యులకు కాస్త ఊరటనిచ్చారు. కాగా నేడు గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
హైదరాబాదు: రూ. 966
వరంగల్: రూ. 974
విశాఖపట్నం: రూ.912
విజయవాడ: రూ. 927
గుంటూరు: రూ. 944