ఈ LIC పాలసీలో చేరితే మీకు రూ. లక్షకు పైగా పెన్షన్

దేశీయ దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త కొత్త పాలసీలను తీసుకొస్తూ ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది

Update: 2023-09-06 12:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త కొత్త పాలసీలను తీసుకొస్తూ ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. పదవీ విరమణ తరువాత కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఈ మధ్య కొత్తగా ‘LIC న్యూ జీవన్ శాంతి’ అనే పాలసీని తీసుకొచ్చింది. ఇది పెన్షన్ అందించే స్కీమ్. దీనిలో చేరిన వారు ప్రతి నెలా పెన్షన్ పొందవచ్చు. ఒక్కసారి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి పెన్షన్ రూపంలో తిరిగి ఆ డబ్బులు తీసుకోవచ్చు.

ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేయిడ్ ప్లాన్. పాలసీ కొనుగోలు చేసే సమయంలోనే మీకు ఎంత పెన్షన్ లభిస్తుందో తెలిసిపోతుంది. పాలసీ తీసుకునే అమౌంట్‌ను బట్టి పెన్షన్ డిసైడ్ అవుతుంది. ఈ పాలసీలో రెండు యాన్యుటీ ఆప్షన్లు ఉంటాయి. అవి డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్, డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్. వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కసారి ఆప్షన్ ఎంచుకుంటే తర్వాత దీన్ని మార్చుకోవడం కుదరదు.

పాలసీ కొనుగోలు చేసిన వెంటనే పెన్షన్ రావాలనుకుంటే ఇమ్మీడియేట్ యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలి. ఒకవేళ కొంతకాలం తర్వాత పెన్షన్ రావాలనుకుంటే డిలేయిడ్ యాన్యుటీ ప్లాన్ ఎంచుకోవచ్చు.30 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ ప్లాన్ కొనుగోలు చేయవచ్చు. గరిష్టంగా 79 ఏళ్ల వయసు కలిగిన వారు కూడా చేరవచ్చు. పాలసీ కనీస కొనుగోలు ధర రూ. 1.5 లక్షలు. గరిష్ట పరిమితి లేదు.

పెన్షన్ చెల్లింపును 12 ఏళ్ల వరకు వాయిదా వేసుకోవచ్చు. ఆ తర్వాత పెన్షన్ చెల్లిస్తారు. ఉదాహరణకు.. మీ వయసు 30 ఏళ్లు అనుకుంటే రూ.10 లక్షల మొత్తానికి జీవన్ శాంతి పాలసీ కొనుగోలు చేస్తే 5 సంవత్సరాల తరువాత పెన్షన్ రావాలనుకుంటే మీకు 35 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతి ఏడాది రూ.86 వేలకు పైగా పెన్షన్ పొందవచ్చు. అదే 12 ఏళ్ల తర్వాత పెన్షన్ కావాలనుకుంటే మీకు 42 ఏళ్లు వచ్చాక ప్రతి ఏటా రూ.1.32 లక్షలకు పైగా పెన్షన్ లభిస్తుంది. అదే 45 ఏళ్లు ఉన్నప్పుడు రూ.10 లక్షలతో ప్లాన్ కొనుగోలు చేస్తే 12 ఏళ్ల తరవాత పెన్షన్ రావాలనుకుంటే అప్పుడు మీకు రూ.1.42 లక్షలకు పైగా వస్తాయి. ఈ పాలసీ గురించిన పూర్తి వివరాల కోసం దగ్గరలోని lic బ్రాంచ్‌లో లేదా ఏజెంట్‌ను గాని సంప్రదించగలరు.

Tags:    

Similar News