ఆ ఉద్యోగులకు IRCTC స్పెషల్ చార్జీలు

విమానంలో ప్రయాణించాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌సీటీసీ ఎయిర్ (IRCTC Air) ప్రత్యేకంగా తగ్గింపు ధరలను తీసుకొచ్చింది

Update: 2023-05-12 14:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: విమానంలో ప్రయాణించాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌సీటీసీ ఎయిర్ (IRCTC Air) ప్రత్యేకంగా తగ్గింపు ధరలను తీసుకొచ్చింది. LTC(లీవ్ ట్రావెల్ కన్సెషన్) కింద బుక్ చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రత్యేకమైన చార్జీలు వర్తిస్తాయి. ఎల్‌టీసీ ద్వారా ప్రయాణించాలనుకునే వారు జర్నీ చేయబోయే తేదీ కంటే కనీసం 21 రోజుల ముందుగానే విమాన టికెట్లను బుక్ చేసుకోవాలని కేంద్రం పేర్కొంది. దానికోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ అందుబాటులో ఉంది. దీనిలో విమాన టికెట్స్ బుక్ చేసుకునే వారికి ఈ చార్జీలు వర్తిస్తాయి.


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు http://air.irctc.co.in లేదా ఐఆర్‌సీటీసీ ఎయిర్ యాప్‌లో ఈ టికెట్స్‌ను బుక్ చేసుకోవచ్చు. దీనిలో డిఫెన్స్ ఫేర్, ప్రభుత్వ ఉద్యోగి, ఎల్‌టీసీ ఆప్షన్స్‌లో ఒకదాన్ని ఎంచుకుని, ప్రయాణ వివరాలు నమోదు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగి తమకు అర్హత ఉన్న క్లాస్‌లో తక్కువ చార్జీ ఉన్న నాన్‌స్టాప్ ఫ్లైట్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రయాణ సమయంలో గుర్తింపు పొందిన ప్రభుత్వ ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా ఉండాలి. ఈ కోటా కింద సీట్లు తక్కువ మొత్తంలో ఉంటాయి, కాబట్టి ముందుగా బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

Tags:    

Similar News