IPOs: స్టాక్ మార్కెట్లో వచ్చే వారం 3 కంపెనీల ఐపీఓలు సందడి.. మరో 6 లిస్టింగ్..!
ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లో(Stock Market) ఐపీఓల సందడి కొనసాగిన సంగతి తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లో(Stock Market) ఐపీఓల సందడి కొనసాగిన సంగతి తెలిసిందే. కాగా 2024లో ఇప్పటివరకు మెయిన్ బోర్డు నుంచి 91 కంపెనీలు ఐపీఓకు వచ్చి సుమారు రూ. 1.59 లక్షల కోట్ల నిధుల్ని సమీకరించాయి. ఇదిలా ఉంటే.. డిసెంబర్ నాలుగో వారం కూడా దలాల్ స్ట్రీట్(Dalal Street)లో ఐపీఓలు హవా కొనసాగనుంది. వచ్చే వారం కొత్తగా 3 కంపెనీలు ఐపీఓ(IPO) సబ్ స్క్రిప్షన్(Subscription) కు రానున్నాయి. అయితే ఇందులో మెయిన్ బోర్డ్(Main Board) నుంచి ఒక కంపెనీ ఉండగా.. ఎస్ఎంఈ(SME) సెగ్మెంట్ నుంచి రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ రానున్నాయి. ఇక మెయిన్ బోర్డ్ విభాగం నుంచి ట్రాక్టర్లు(Tractors), క్రేన్లు(Cranes) తయారుచేసే కంపెనీ ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్(Indo Farm Equipment) ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్(IPO)కు రానుంది. ఈ సంస్థ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 31న ప్రారంభమై జనవరి 2 వరకు కొనసాగనుంది. ఐపీఓ ద్వారా సుమారు రూ. 260.15 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 1,21,00,000 షేర్లను జారీ చేయనున్నారు. ఒక్కో షేరు ధరను రూ.204- రూ. 215గా నిర్ణయించింది. ఇక ఎస్ఎంఈ సెగ్మెంట్ నుంచి రాబోతున్న వాటిలో డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్, టెక్నీకెమ్ ఆర్గానిక్స్ ఐపీఓలు ఉన్నాయి. అలాగే వచ్చే వారం ఆరు కంపెనీలు స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ కానున్నాయి.