iPhone 13: ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ ఫోన్ పై అమెజాన్ భారీ డిస్కౌంట్..!

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్(Amazon) ఐఫోన్ 13(iPhone 13) పై భారీ డిస్కౌంట్(Discount) ప్రకటించింది.

Update: 2024-12-08 06:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్(Amazon) ఐఫోన్ 13(iPhone 13) పై భారీ డిస్కౌంట్(Discount) ప్రకటించింది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మొబైల్ ను కేవలం రూ. 45,490కే అందిస్తోంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్(Exchange offer)లో ఈ ఫోన్ ను రూ. 38,050కే సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ బోనస్ విలువ మీ ఓల్డ్ ఫోన్ పరిస్థితి, మోడల్(Model), బ్రాండ్(Brand)పై ఆధారపడి ఉంటుంది. ఇవేగాక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(HDFC Bank) కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1000 తక్షణ తగ్గింపు(Instant Discount) లభిస్తుంది. ఇక నెలకు రూ. 2205 నుండి ఈఎంఐ(EMI)తో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. కాగా లాంచ్ సమయంలో ఐఫోన్ 13 128 జీబీ వేరియంట్ ధర రూ. 79,900గా ఉన్న విషయం తెలిసిందే. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఫొటోగ్రఫీ కోసం 12 మెగాపిక్సెల్ వైడ్, అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఐఫోన్ 13లో ప్రాసెసర్‌గా కంపెనీ ఏ15 బయోనిక్ చిప్‌సెట్‌ను అందిస్తోంది.

Tags:    

Similar News