2,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్న మెట్రో బ్రాండ్స్!
దేశీయంగా ఉద్యోగుల తొలగింపుల ట్రెండ్ కొనసాగుతున్న వేళ ప్రనుఖ ఫుట్‌వేర్ కంపెనీ మెట్రోల్ బ్రాండ్స్ వేలాది మంది ఉద్యోగులను నియమించనున్నట్టు ప్రకటించింది.
ముంబై: దేశీయంగా ఉద్యోగుల తొలగింపుల ట్రెండ్ కొనసాగుతున్న వేళ ప్రనుఖ ఫుట్‌వేర్ కంపెనీ మెట్రోల్ బ్రాండ్స్ వేలాది మంది ఉద్యోగులను నియమించనున్నట్టు ప్రకటించింది. అందులో భాగంగా 2025 నాటికి కంపెనీ ప్రారంభించబోయే కొత్త స్టోర్లలో కనీసం 1,500-2,000 మంది సిబ్బందిని తీసుకుంటామని మెట్రో బ్రాండ్స్ సీఈఓ ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది చివరి నాటికి తాము దేశవ్యాప్తంగా 720 స్టోర్లను, సుమారు 4,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్నాం. కొత్తగా ఏర్పాటు చేసే స్టోర్ల కోసం ఎక్కువ మంది బ్యాక్ ఆఫీస్ సిబ్బంది అవసరం ఉంటుందని సీఈఓ నిస్సాన్ జోసెఫ్ అన్నారు.
అధిక ఖర్చుకు వెనకాడని వినియోగదారులు, వారి వ్యయం పెరగడం వంటి అంశాలు మెట్రో బ్రాండ్ అమ్మకాల వృద్ధికి దోహదపడుతున్నాయని ఆయన తెలిపారు. గత డిసెంబర్ ఆఖరు నాటికి ఈ ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో కంపెనీ ఆదాయం 68 శాతం పెరిగింది. దేశీయంగా మధ్యతరగతి కుటుంబాల ఆదాయంలో పెరుగుదలను చూస్తున్నాం, ఇలాంటి సమయంలో వినియోగదారుల నుంచి కొనుగోళ్లు పెరుగుతాయని, అందుకు అనుగుణంగా కొత్త స్టోర్ల ఏర్పాటు ప్రణాళిక వేగవంతం చేయాలని భావిస్తున్నట్టు జోసెఫ్ వెల్లడించారు. ముఖ్యంగా చిన్న నగరాలపై తాము దృష్టి సారిస్తాయని ఆయన పేర్కొన్నారు.