Entertainment Industry: ఏటా రూ. 22,400 కోట్లు నష్టపోతున్న ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమ

సమస్యను పరిష్కరించేందుకు తక్షణం చర్యలు అవసరమని అభిప్రాయపడింది

Update: 2024-10-23 12:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి ముప్పు గణనీయంగా పెరుగుతోంది. దీనివల్ల ఏటా ఎంటర్‌టైన్‌మెంట్ రంగం రూ. 22,400 కోట్ల వరకు నష్టాలను చవిచూస్తోంది. ముఖ్యంగా పైరసీ కారణంగా నష్టం ఎదురవుతోందని, 51 శాతం మంది వినియోగదారులు పైరసీ కంటెంట్‌ను యాక్సెస్ చేస్తున్నట్టు ఈవై నివేదిక తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తక్షణం చర్యలు అవసరమని అభిప్రాయపడింది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ)తో కలిసి రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. పరిశ్రమకు పైరసీ అతిముఖ్యమైన ఆందోళనగా ఉంది. సినిమా థియేటర్లలో పైరేటెడ్ కంటెంట్ వల్ల రూ. 13,700 కోట్లు నష్టం వాటిల్లుతుండగా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వల్ల రూ. 8,700 కోట్లు అని, ఇతర మార్గాల్లో మరో రూ. 4,300 కోట్లు ఉండొచ్చని నివేదిక తెలిపింది. స్ట్రీమింగ్ సేవల తర్వాత మొబైల్ యాప్‌లు, సోషల్ మీడియా, టొరెంట్ సైట్‌ల వల్ల నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కరోనా మహమ్మారి తర్వాత సబ్‌స్క్రిప్షన్ ఆదాయం 150 శాతం పెరిగినప్పటికీ షేరింగ్ సబ్‌స్క్రిప్షన్ ఉండటం, కావాల్సిన కంటెంట్ అందుబాటులో లేకపోవడం, ఎక్కువ ఫీజుల వల్ల కస్టమర్లు పైరసీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. డిజిటల్ ఎంటర్‌టైన్ రంగం పైరసీ ముప్పు నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, వినియోగదారుల మధ్య సమన్వయం అవసరమని నివేదిక సూచించింది. 

Tags:    

Similar News