Indian Bank: కస్టమర్లకు ఇండియన్ బ్యాంక్ గుడ్ న్యూస్.. ఈ స్పెషల్ ఎఫ్‌డీలో డిపాజిట్ గడువు పొడిగింపు..!
ప్రముఖ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్(Indian Bank) తమ కస్టమర్ల కోసం అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తూ ఇటీవలే ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్(Special FD Scheme)లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్(Indian Bank) తమ కస్టమర్ల కోసం అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తూ ఇటీవలే ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్(Special FD Scheme)లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. Ind super, Ind supreme పేరుతో వీటిని ప్రవేశ పెట్టింది. Ind super స్కీమ్ ను 400 రోజుల టెన్యూర్(Tenure)తో తీసుకురాగా.. Ind supreme స్కీమ్ ను 300 రోజుల టెన్యూర్ తో ప్రవేశపెట్టింది. అయితే ఈ స్పెషల్ స్కీమ్ లలో డిపాజిట్ చేయడానికి 30 నవంబర్ 2024 వరకు గడువు ఉండేది. ఇప్పటికే పలు మార్లు ఈ స్కీమ్ గడువు పొడిగించిన ఇండియన్ బ్యాంక్ తాజాగా మరోసారి పెంచింది. ఈ ఎఫ్‌డీల కాలవ్యవధిని 31 మార్చి 2025 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
కాగా Ind super 400 డేస్ స్పెషల్ ఎఫ్‌డీలో రూ. 10 వేల నుంచి రూ. 3 కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం కింద సాధారణ డిపాజిటర్లకు 7.30 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.05 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక Ind supreme 300 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీలో రూ. 5 వేల నుంచి రూ. 3 కోట్ల డిపాజిట్ లపై సాధారణ డిపాజిటర్లకు 7.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం వడ్డీ లభిస్తుంది.