Economy: $30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు మగువలే కీలకం

భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి మహిళల భాగస్వామ్యం చాలా అవసరమని ది/నడ్జ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక పేర్కొంది.

Update: 2024-08-24 12:05 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి మహిళల భాగస్వామ్యం చాలా అవసరమని ది/నడ్జ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక పేర్కొంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి శ్రామిక శక్తిలో అదనంగా 40 కోట్ల మంది మహిళలు ఆర్థిక వ్యవస్థకు $14 ట్రిలియన్ల సహకారం అందించాలని తెలిపింది. దీని వలన ప్రస్తుత మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 2047 ఆర్థిక సంవత్సరం నాటికి 37 శాతం నుండి 70 శాతానికి దాదాపు రెట్టింపు అవుతుందని పేర్కొంది.

లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ డిస్టిలేషన్ రిపోర్ట్ అనే కొత్త నివేదికను విడుదల చేసిన ది/నడ్జ్ ఇన్‌స్టిట్యూట్, దీనిలో పలు కీలక వివరాలను వెల్లడించింది. అంచనాల ప్రకారం, 2047 నాటికి కేవలం 11 కోట్ల మంది మహిళలు మాత్రమే వర్క్‌ఫోర్స్‌లో చేరతారని, అయితే ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి అదనంగా 145 మిలియన్ల మంది మహిళలు అవుతారని డేటా తెలిపింది.

స్త్రీ పురుషుల మధ్య ఉద్యోగ భద్రత, పునరుద్ధరణలో తీవ్ర అసమానతను కూడా నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం, మహిళలు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఏడు రెట్లు ఎక్కువగా ఉంది. 2019లో ఉద్యోగం పొందిన మహిళల్లో దాదాపు సగం మంది 2020 నాటికి ఉద్యోగాలను విడిచిపెట్టినట్లు నివేదిక పేర్కొంది. నిర్మాణ రంగంలో, శ్రామిక శక్తిలో మహిళలు కేవలం 12 శాతం మాత్రమే ఉన్నారు.

ప్రధానంగా వ్యవసాయం, తయారీ వంటి తక్కువ ఉత్పాదక రంగాల్లో ఉపాధి పొందుతున్నారు, ఇక్కడ అభివృద్ధి అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. నైపుణ్యం లేని ఉద్యోగాలలో పురుషుల కంటే మహిళలు తక్కువ సంపాదిస్తున్నారని నివేదిక వెల్లడించింది. ది/నడ్జ్ ప్రైజ్ డైరెక్టర్ అండ్ హెడ్ కనిష్క ఛటర్జీ మాట్లాడుతూ, లేబర్ మార్కెట్‌లో మహిళల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అడ్డంకులను తొలగించాలని అన్నారు.


Similar News