రైతులకు గుడ్‌న్యూస్: అకౌంట్లోకి PM కిసాన్ డబ్బులు.. ఎప్పుడంటే..!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్రం ప్రతి ఏడాది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.6000 లను అందిస్తున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్రం ప్రతి ఏడాది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.6000 లను అందిస్తున్న విషయం తెలిసిందే. వీటిని ఏడాదికి మూడు విడతలుగా రూ. 2000 లను చెల్లిస్తుంది. ఇప్పటికే 13 విడత చెల్లింపులు పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం 14 విడత చెల్లింపులు చేయనుంది. రైతులు కూడా ఈ డబ్బుల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.
అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం, 14 విడత నిధులను జూన్ మూడో వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం రానప్పటికీ రైతులు వానాకాలం ప్రారంభంలోనే నిధులను పొందే అవకాశం ఉంది, కాబట్టి 14వ విడత జూన్ 2023 మూడో వారంలో విడుదల చేయనున్నారు. 14 వ విడత డబ్బులు అకౌంట్లో జమ అయ్యాయో లేదో తెలుసుకోడానికి pmkisan.gov.in అధికారిక సైట్‌కి లాగిన్ కావాలి.