ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్
ఐడీబీఐ బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను పెంచింది.
దిశ, వెబ్‌డెస్క్: ఐడీబీఐ బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను పెంచింది. ఈ పెంపుదల రూ. 2 కోట్లలోపు ఎఫ్‌డీలకు వర్తిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్ 12 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంకు తన ఎఫ్‌డీలపై వడ్డీని 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ప్రస్తుతం బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధుల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తోంది. దీనిపై సాధారణ ప్రజలకు వడ్డీ రేట్లు 3 శాతం నుంచి 6.25 శాతంగా ఉంది. అదే సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 6.75 శాతంగా ఉంది. ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి 444 రోజుల స్పెషల్ డిపాజిట్ స్కీమ్‌పై సాధారణ ప్రజలకు 7.15 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 7.65 శాతం వడ్డీని అందిస్తోంది.
బ్యాంకు తన సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, 7-30 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3% వడ్డీ రేటు లభిస్తుంది. అదే విధంగా 46-90 రోజుల డిపాజిట్లపై 4.25%, 91- 6 నెలలకు 4.75%, 6 నెలలు, ఒక ఏడాది డిపాజిట్లపై 5.50%, ఒక ఏడాది- 2 సంవత్సరాల వరకు 6.75% చొప్పున వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల ఎఫ్‌డీలపై 6.50%, 5-10 ఏళ్ల ఎఫ్‌డీలపై 6.25 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది.
Also Read...