Hyundai కూడా ధరలు పెంచేస్తోంది!
దేశీయంగా కార్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కీలక కంపెనీలైన మారుతి సుజుకి, టాటా మోటార్స్ అన్ని మోడళ్లపై పెంపు నిర్ణయం తీసుకున్నాయి.
న్యూఢిల్లీ: దేశీయంగా కార్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కీలక కంపెనీలైన మారుతి సుజుకి, టాటా మోటార్స్ అన్ని మోడళ్లపై పెంపు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా దేశీయంగా దిగ్గజ హ్యూండాయ్ మోటార్ ఇండియా తన అన్ని మోడళ్లపై ధరలను పెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను పరిగణలోకి తీసుకుని కార్ల ధరలు పెంచుతున్నామని, ఈ నిర్ణయం వచ్చే నెల నుంచి అమలవుతుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
వాహనాల తయారీలో కీలకమైన పరికరాలు ఖరీదు కావడంతో ఉత్పత్తి వ్యయం భారంగా మారిందని కంపెనీ తెలిపింది. అయితే, ధరల పెంపు ఎంత మొత్తం అనేదానిపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. వినియోగదారులపై ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు అంతర్గతంగా కావాల్సిన ప్రయత్నాలు కొనసాగిస్తామని హ్యూండాయ్ పేర్కొంది.
కాగా, ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా ఇప్పటికే దిగ్గజ వాహన తయారీ కంపెనీలు జనవరి నుంచి ధరలు పెంచనున్నట్టు ప్రకటించాయి. అందులో మారుతీ సుజుకి, టాటా మోటార్స్‌తో పాటు ఆడి, కియా, ఎంజీ మోటార్, రెనాల్ట్ కంపెనీలున్నాయి.
Also Read...