HSBC Bank: ఫేక్ వాట్సాప్ గ్రూపులతో జాగ్రత్తగా ఉండండి.. కస్టమర్లకు హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ హెచ్చరిక
మన దేశంలో గత కొంత కాలంగా సైబర్ మోసాలు(Cyber Fraud) పెరిగిపోతున్న విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: మన దేశంలో గత కొంత కాలంగా సైబర్ మోసాలు(Cyber Fraud) పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బ్యాంక్ అధికారులు తమ ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్(Digital Arrest) పేరుతో జరుగుతున్న మోసాలపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(HDFC Bank) ఇటీవలే తమ కస్టమర్లను అలర్ట్ చేయగా.. తాజాగా ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌ఎస్‌బీసీ(HSBC) కూడా కీలక సూచనలు చేసింది. తమ బ్యాంక్ పేరుతో వస్తున్న నకిలీ కాల్స్(Fake Calls), మెసేజ్(Message)లతో కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని, ఈ మేరకు నేరాలకు పాల్పడుతున్న ఫోన్ నంబర్లు(Phone Numbers), వాట్సాప్ గ్రూప్(Whatsapp Group)ల గురించి ఖాతాదారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. '85-HSBC Global Academy' పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ఛానెల్ క్రియేట్ చేశారని, అలాగే 8008723938 మొబైల్ నెంబర్ తో కస్టమర్లను కాంటాక్ట్ అవుతున్నారని, ఇవి తమ సంస్థకు చెందినవి కావని సృష్టం చేసింది. ఇవేకాకుండా ఎక్స్(X), ఫేస్ బుక్(Facebook), ఇంస్టాగ్రామ్(Instagram), యూట్యూబ్(YouTube) లాంటి సోషల్ మీడియా వేదికగా మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అలెర్ట్ గా ఉండాలని, బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ కాకుండా వేరే లింకులను ఓపెన్ చేయద్దని కస్టమర్లను సూచించింది.