ఆతిథ్య రంగంలో పెరుగుతున్న నియామకాలు!

గత కొన్ని నెలలుగా వివిధ రంగాల్లో తొలగింపుల కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్న సమయంలో దేశీయ ఆతిథ్య రంగం వేలాది మందిని నియమించుకుంటోంది.

Update: 2023-04-07 17:08 GMT

న్యూఢిల్లీ: గత కొన్ని నెలలుగా వివిధ రంగాల్లో తొలగింపుల కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్న సమయంలో దేశీయ ఆతిథ్య రంగం వేలాది మందిని నియమించుకుంటోంది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోవడం, వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడిన నేపథ్యంలో సంస్థలు కొత్త వారిని తీసుకుంటున్నాయి. ఇటీవల కొత్త హోటళ్ల ప్రారంభం ద్వారా కొవిడ్ సమయంలో తొలగించిన వారి స్థానాలను తిరిగి భర్తీ చేస్తున్నాయి. కొత్త నియామకాల్లో అత్యధికంగా మహిళా ఉద్యోగులను తీసుకుంటున్నట్టు కంపెనీలు చెబుతున్నాయి.

ప్రముఖ లెమన్ ట్రీ హోటల్స్ హెచ్ఆర్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఏడాది తాము కొత్తగా 2,000 మందిని నియమించనున్నట్టు చెప్పారు. అలాగే, 2024 నాటికి మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం, 2026 సమయానికి 30 శాతం మహిళలే ఉండేలా ప్రణాళిక కలిగి ఉన్నట్లు ఆయన తెలిపారు. విస్తరణలో భాగంగా 800-900 మంది కొత్త ఉద్యోగులను తీసుకుంటామని లీలా ప్యాలెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

Tags:    

Similar News