చరిత్ర సృష్టించిన UPI చెల్లింపులు.. ఒక్క నెలలో ఇన్ని కోట్లా..?
యూపీఐ చెల్లింపులు చరిత్ర సృష్టించాయి. ఒక్క మార్చి నెలలో రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగినట్లు తెలుస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్: యూపీఐ చెల్లింపులు చరిత్ర సృష్టించాయి. ఒక్క మార్చి నెలలో రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ డేటా ప్రకారం.. ఒక్క మార్చి నెలలోనే రూ. 14.1 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లను 868.5 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే వరుసగా 60% మరియు 46% పెరిగింది. మొత్తం మీద, చెల్లింపు వ్యవస్థ FY23లో 8,376 కోట్ల లావాదేవీలు ప్రాసెస్ చేసింది. దీని మొత్తం విలువ ₹139 లక్షల కోట్లు.