HCL Tech Q2 Results: ఒక్కో షేరుకు రూ.12 చొప్పున మధ్యంతర డివిడెంట్.. రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్

భారతదేశంలోని ప్రముఖ కంపెనీలు గత కొన్ని రోజులుగా జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల(July-September Quarter Results)ను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే .

Update: 2024-10-14 16:28 GMT

దిశ, వెబ్‌డెస్క్:భారతదేశంలోని ప్రముఖ కంపెనీలు గత కొన్ని రోజులుగా జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల(July-September Quarter Results)ను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే . ఇటీవలే దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఫలితాలను ప్రకటించగా తాజాగా దేశంలోనే మూడో అతిపెద్ద సేవల హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(HCL Technologies) తమ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) రెండో త్రైమాసికం(Q2FY25)లో సంస్థ లాభం 11 శాతం పెరిగి రూ. 4,235 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు హెచ్‌సీఎల్ తెలిపింది. కాగా గతేడాది రెండో త్రైమాసిక ఫలితాల నాటికి నికర లాభం 3,832 కోట్లుగా ఉందని తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది.

ఇక సంస్థ ఆదాయం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి 8.2 శాతం వృద్ధి(Growth) సాధించింది. ప్రస్తుతం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 28,862 కోట్లుగా నమోదైనట్లు హెచ్‌సీఎల్ వెల్లడించింది. గతేడాది ఇదే టైంలో సంస్థ ఆదాయం రూ. 26,672 కోట్లుగా ఉంది. ఇక రెండో త్రైమాసిక ఆర్ధిక ఫలితాల సందర్భంగా తమ షేర్ హోల్డర్లకు హెచ్‌సీఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్కో షేరుకు రూ.12 చొప్పున మధ్యంతర డివిడెంట్(Interim Dividend) చెల్లించేందుకు బోర్డు ఆఫ్ డైరెక్టర్లు(Board of Directors) ఒప్పుకున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి అక్టోబర్ 22ను రికార్డు తేదిగా నిర్ణయించింది.  


Similar News