Tecno Camon 30s: టెక్నో నుంచి కొత్త స్మార్ట్​ఫోన్ విడుదల.. ఫీచర్లు ఏంటంటే..?

ప్రముఖ స్మార్ట్​ఫోన్ బ్రాండ్ టెక్నో(Tecno) తన కొత్త మిడ్ రేంజ్ మొబైల్(Mid Range Mobile)​ను అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసింది.

Update: 2024-10-14 15:16 GMT

దిశ, వెబ్‌డెస్క్:ప్రముఖ స్మార్ట్​ఫోన్ బ్రాండ్ టెక్నో(Tecno) తన కొత్త మిడ్ రేంజ్ మొబైల్(Mid Range Mobile)​ను అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్లతో కెమన్ 30ఎస్(Camon 30s) స్మార్ట్​ఫోన్​ను బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. ఈ కొత్త మొబైల్ 8GB +256GB, 8GB + 128GB RAM, 6GB + 128GB స్టోరేజీ వేరియంట్స్ లలో లభిస్తుంది. 8GB +256GB వేరియంట్ ధర సుమారు రూ.18,200గా కంపెనీ నిర్ణయించింది. మిగతా రెండు వేరియంట్ల ధరలను మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ఈ కొత్త ఫోనులో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్​ఫోన్ డివైజ్ బ్లూ, నెబులా వయొలెట్, సెలెస్టియల్ బ్లాక్ అలాగే డాన్ గోల్డ్ కలర్స్ లో లభిస్తుంది. అయితే ఈ కొత్త కెమన్ 30ఎస్ మొబైల్​ను ఇండియా మార్కెట్లోకి ఎప్పడు విడుదల చేస్తారనే విషయంపై కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

టెక్నో కెమన్ 30ఎస్(Tecno Camon 30s) ఫీచర్స్..

  • 6.78-అంగుళాల AMOLED స్క్రీన్‌
  • మీడియాటెక్ హీలియో జీ100(MediaTek Helio G100) చిప్సెట్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
  • 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్
  • 50-మెగాపిక్సెల్ తో కూడిన బ్యాక్ కెమెరా, అలాగే సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.
  • 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.

Similar News