విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తొలగించిన కేంద్రం!
ప్రస్తుతం ముడి చమురుపై విధిస్తున్న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తొలగిస్తూ కేంద్రం మంగళవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
న్యూఢిల్లీ: చమురు ఉత్పత్తి దేశాలు అనూహ్యంగా తీసుకున్న నిర్ణయంతో చమురు, గ్యాస్ ధరలు మరింత పెరగొచ్చనే అంచనాల మధ్య కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ముడి చమురుపై విధిస్తున్న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తొలగిస్తూ కేంద్రం మంగళవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు ముడి చమురు టన్నుకు రూ. 3,500 చొప్పున విండ్‌ఫాల్ ట్యాక్స్ వసూలు వేసిన ప్రభుత్వం దాన్ని సున్నాకు తగ్గించింది. పెట్రోల్, ఏటీఎఫ్‌పై పూర్తిగా విండ్‌ఫాల్ ట్యాక్స్ తొలగించగా, డీజిల్‌పై లీటర్‌కు గతంలో ఉన్న రూ.1 నుంచి 50 పైసలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. చమురు కంపెనీలు అనూహ్యంగా భారీ లాభాలను ఆర్జించినపుడు ప్రభుత్వ ఆదాయం సమకూర్చుకునేందుకు విండ్‌గాల్ పన్నును విధించింది. గతేడాది జూల 1న ఇది అమలైంది. అప్పటినుంచి బ్రెంట్ క్రూడ్ ధరల ప్రకారం 2022, జూలలో ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను టన్నుకు రూ.23,250 నుచి 2023, మార్చి 21 నాటికి టన్నుపై రూ. 3,500కి సవరించారు. ఒపెక్+ దేశాలు ముడిచమురు ఉత్పత్తి తగ్గిస్తామని ప్రకటిచిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఒపెక్+ దేశాల నిర్ణయంతో సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 6 శాతం పెరిగి బ్యారెల్‌కు 84.58 డాలర్లకు చేరుకుంది.