Union Budget 2024: బడ్జెట్‌లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి: పరిశ్రమ వర్గాలు

మరికొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి

Update: 2024-07-19 14:01 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: మరికొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో బడ్జెట్‌లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించి ప్రభుత్వం అధిక నిధులు కేటాయించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్రామీణ ఉద్యోగాలను పెంచడానికి, వ్యవసాయ దారులకు తగిన ప్రోత్సాహం అందించడానికి, మెరుగైన రోడ్లు,కనెక్టివిటీని పెంచడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు ఉంటాయని వారు భావిస్తున్నారు. పలు కొత్త పథకాలను సైతం ప్రవేశపెట్టి వైద్య, ఆరోగ్య సదుపాయాలను డెవలప్ చేయడానికి, స్థానిక నైపుణ్యాలను అభివృద్ధి చేసే కొత్త ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుకు వస్తుందని అంచనా వేస్తున్నారు.

అలాగే, ఇతర రంగాలకు కూడా పలు రాయితీలు, ప్రోత్సహకాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైద్య పరికరాలపై కస్టమ్స్ సుంకాలు తగ్గింపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బిగ్‌డేటా, రియల్‌ఎస్టేట్ వంటి వాటిపై ప్రోత్సాహాకాలు, ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.75,000కి పెంచడం, చట్టంలోని సెక్షన్ 80C కింద గృహ బీమా ప్రీమియంలకు పన్ను మినహాయింపులను అందించడం, సైబర్ బీమా వంటి వాటిపై శుభవార్త వినే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News