బిగ్ షాక్.. మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్. రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెళ్లీల సీజన్,శుభకార్యాలు

Update: 2023-03-03 01:48 GMT

దిశ, వెబ్‌డెస్క్ :  బంగారం ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్. రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెళ్లీల సీజన్,శుభకార్యాలు జరుపుకోవడానికి మంచి రోజు కావడంతో, బంగారం కొనుగోలు చేయాలి అనుకునేవారు రేటు చూసి షాక్ అవుతున్నారు. కాగా, శుక్రవారం మరోసారి బంగారం రేటు భారీగా పెరిగింది.

హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.160 పెరగడంతో గోల్డ్ ధర రూ.56,450గా ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.150 పెరగడంతో గోల్డ్ ధర రూ.51,750గా ఉంది.

Tags:    

Similar News