ఫెడ్ ప్రభావంతో భారీగా పెరిగిన బంగారం

బంగారం ధరలు రికార్డు స్థాయిలకు పెరిగాయి. అమెరికా ఫెడ్ తాజా సమావేశంలో వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లలో పసిడి

Update: 2023-02-02 14:08 GMT

న్యూఢిల్లీ: బంగారం ధరలు రికార్డు స్థాయిలకు పెరిగాయి. అమెరికా ఫెడ్ తాజా సమావేశంలో వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లలో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. దానివల్ల దేశీయంగా కూడా ఆ ప్రభావం కనబడింది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 650 పెరిగి రూ. 58,570కి చేరుకుంది. 22 క్యారెట్లు రూ. 600 పెరిగి రూ. 53,600గా ఉంది. వెండి సైతం కిలోకు ఏకంగా రూ. 1,800 పుంజుకుని రూ. 77,800 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్సు ధర 19956 డాలర్లు ఉండగా, వెండి ఔన్స్ 24.15 డాలర్లు ఉంది.

ద్రవ్యోల్బణ కట్టడికి అమెరికా ఫెడ్ తాజాగా వడ్డీ రేట్లను పావు వంతు పెంచిన సంగతి తెలిసిందే. మరికొన్నాళ్లు పెంపు కొనసాగుతుందన్న ఫెడ్ చీఫ్ జెరోమ్ వ్యాఖ్యలతో బంగారం గిరాకీ ఊపందుకుంది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూరోపియన్ బ్యాంకుల పాలసీ నిర్ణయాలు కూడా వెలువడనున్న నేపథ్యంలో పసిడి ధరలపై ప్రభావం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, గురువారం దేశంలోని ప్రధాన నగరాల్లో ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్ లో రూ. 53,600గా ఉంది, చెన్నైలో రూ. 55,050, ముంబైలో రూ. 53,600, కోల్ కతాలో రూ. 53,600, బెంగళూరులో రూ. 53,650గా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : 03 ఫిబ్రవరి : మహిళలకు షాకింగ్ న్యూస్..మళ్లీ పెరిగిన Gold Price

Tags:    

Similar News