Pension: 2025 ఆర్థిక సంవత్సరంలో పెన్షన్‌ల కోసం రూ.79 వేల కోట్లు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పెన్షన్‌ స్కీమ్‌తో అదనపు భారం భారీగా పెరగనుంది

Update: 2024-08-25 09:01 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పెన్షన్‌ స్కీమ్‌తో అదనపు భారం భారీగా పెరగనుంది. తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు, రక్షణ మినహా పెన్షన్‌ల కోసం ప్రభుత్వం రూ.79,241 కోట్లు వెచ్చించనుండగా, ఇది దాని ముందు సంవత్సరంతో పోలిస్తే 6.1 శాతం ఎక్కువ. డేటా ప్రకారం, గత మూడేళ్లలో ప్రభుత్వ పెన్షన్ వ్యయంలో సగటు వృద్ధి 7.1 శాతంగా ఉంది. పెన్షన్ బిల్లు ఎఫ్‌‌వై21లో రూ.62,725 కోట్లు కాగా, ఎఫ్‌‌వై23 నాటికి రూ.68,066 కోట్లకు, ఎఫ్‌‌వై24లో రూ. 74,701 కోట్లకు పెరిగింది. ఇది ఎఫ్‌‌వై26లో మరింత పెరిగే అవకాశం ఉంది.

కొత్త యూపీఎస్‌ అమలుతో మరో రూ.6,250 కోట్లు ఖర్చు అవుతుందని స్థూల లెక్కల ప్రకారం పింఛను బిల్లు తక్కువ రెండంకెలకు చేరే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల కోసం వ్యయం ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. ఎఫ్‌వై10 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు 10.4 శాతం వార్షిక వృద్ధి రేటుతో పెరిగాయి. గత 16 ఏళ్లలో పెన్షన్ బిల్లు 4.4 రేట్లు పెరిగింది. ఇది కరోనా మహమ్మారి తర్వాత కొంత మందగించింది. 2026 నుండి అమలు చేయబోయే ఎనిమిదవ వేతన సంఘం అమలుతో జీతాలు పెరగడం వల్ల పెన్షన్ సహకారం మరింత పెరిగే అవకాశం ఉంది, ఇది కార్పస్, ప్రభుత్వ పెన్షన్ బిల్లుకు అవుట్‌గోను మరింత పెంచుతుంది


Similar News