వరుసగా నాలుగో నెలలో కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు!
భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) వరుసగా నాలుగో నెలలోనూ పెట్టుబడులను కొనసాగించారు.
ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) వరుసగా నాలుగో నెలలోనూ పెట్టుబడులను కొనసాగించారు. భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి సానుకూలంగా ఉండటంతో ఎఫ్‌పీఐలు జూన్‌లో ఇప్పటివరకు రూ. 16,405 కోట్ల విలువైన నిధులు భారత మార్కెట్లలో ఉంచారు. గత నెలలో తొమ్మిది నెలల గరిష్ఠం రూ. 43,838 కోట్లు, అంతకుముందు ఏప్రిల్‌లో రూ. 11,631 కోట్లు, మార్చిలో రూ. 7,936 కోట్ల విలువైన షేర్లను ఎఫ్‌పీఐలు కొనుగోలు చేశారని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి.
అంతకుమునుదు జనవరి-ఫిబ్రవరి మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు రూ. 34 వేల కోట్లకు పైగా వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత ఎఫ్‌పీఐల పెట్టుబడుల ధోరణిని పరిశీలిస్తే ఎఫ్‌పీఐలు మరికొంత కాలంపాటు భారత మార్కెట్లపై విశ్వాసాన్ని కొనసాగిస్తారని స్మాల్‌కేస్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ పార్ట్‌నర్ మయాంక్ మెహ్రా పేర్కొన్నారు.