Gold rates: భారీగా పతనమైన బంగారం ధరలు.. ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
పెళ్లిళ్లు, పండుగలు.. శుభకార్యాలు ఏవైనా బంగారం (Gold) కొనటం శుభసూచిక భావిస్తారు భారతీయులు.

దిశ, వెబ్ డెస్క్: పెళ్లిళ్లు, పండుగలు.. శుభకార్యాలు ఏవైనా బంగారం (Gold) కొనటం శుభసూచిక భావిస్తారు భారతీయులు. అయితే, ఇది కేవలం ఆభరణంగా మాత్రమే కాదు, పెట్టుబడి వనరుగా కూడా చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక గత కొన్ని రోజులుగా పసిడి ధరలు ఆకాశానికి పరుగులు పెడుతుండటం తెలిసిందే. దీంతో బంగారం కొనాలనుకునే వారికి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కానీ, ఇప్పుడు చెప్పే వార్త వింటే.. ఎగిరి గంతేసి వెంటనే బంగారం షాపులకు పరుగులు పెడతారు. ఎందుకంటే.. కేవలం ఒకరోజులో గోల్డ్ రేటు భారీగా పతనమైంది. శుక్రవారం రాత్రి ట్రెండింగ్ ముగిసే సమయానికి తులంపై (10 గ్రాములు) ఏకంగా రూ.2,400 తగ్గింది. అంతేకాదు, కిలో వెండి సైతం రూ.8000 తగ్గింది. దీంతో పసిడి ప్రియులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈనెల 1న 24 క్యారెట్ల తులం బంగారం రూ.94000కు చేరి ఆల్ టైం రికార్డుకు చేరగా.. వారం రోజుల్లోనే రూ.3000 తగ్గటం గమనార్హం. అలాగే, కిలో వెండి సైతం రూ.12,000కు పైగా తగ్గింది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో పసిడి ధరలు పది గ్రాముల 24 క్యారెట్లు రూ.91,790 ఉండగా, పది గ్రాముల 22 క్యారెట్లు రూ. 84,150గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 83,390 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 91,630 వద్ద ఉన్నాయి. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై, చెన్నై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి. అలాగే ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ.99,000 వద్దకు చేరగా, ఇతర నగరాల్లో కిలో వెండి ధర రూ.1.07 లక్షల వద్ద ఉంది.
కాగా, ఈ ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులపై బంగారం, వెండి ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలో ధరలలో హెచ్చు తగ్గులు ఉంటాయి. అలాగే స్థానిక పరిస్థితుల ఆధారంగా ధరల్లో మార్పులు ఉండొచ్చు.