9 నెలల రికార్డు స్థాయికి విదేశీ పెట్టుబడులు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) భారతీయ ఈక్విటీలలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు

Update: 2023-05-27 11:01 GMT

ముంబై: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) భారతీయ ఈక్విటీలలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా మే నెలకు సంబంధించి రికార్డు స్థాయిలో విదేశీ మదుపరులు భారత ఈక్విటీలలో కొనుగోళ్లను జరిపారు. NSDL డేటా ప్రకారం, మే 1 నుండి 26 వరకు భారత ఈక్విటీలలో విదేశీ మదుపరులు రూ.37,317 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఇది 2023లో అత్యధిక నెలవారీ కొనుగోలు మాత్రమే కాకుండా, గత ఏడాది నవంబర్ తర్వాత ఇదే అత్యధిక స్థాయి.

ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్‌లో భారీ పెట్టుబడి పెట్టడంతో పాటు అన్ని రంగాల్లో కూడా ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్ సానుకూలంగా ఉంది. ఇదే ట్రెండ్ రానున్న కాలంలో కూడా కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల పెట్టుబడులకు భారత్ ఒక గమ్యస్థానంగా ఉంది. భారత పట్ల ఉన్న నమ్మకమైన సానుకూల ధోరణి కారణంగా విదేశీ పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇంతకుముందు ఏప్రిల్ నెలలో విదేశీ పెట్టుబడిదారులు రూ.11,631 కోట్ల నిధులను ఇన్వెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. కార్పొరేట్ ఫలితాలు కూడా అనుకూలంగా ఉండటం వలన విదేశీ పెట్టుబడిదారులకు మరింత ప్రోత్సహకరంగా అనిపించి అత్యధిక స్థాయిలో కొనుగోళ్లను జరిపారని నిపుణుల అంచనా.

Tags:    

Similar News