హోలీ సందర్బంగా 80 శాతం భారీ తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బచత్ ధమాల్ సేల్ 2023’
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రాబోయే హోలీ పండుగను పురస్కరించుకుని కొత్తగా ‘బిగ్ బచత్ ధమాల్ సేల్ 2023’ ను తీసుకొచ్చింది
దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రాబోయే హోలీ పండుగను పురస్కరించుకుని కొత్తగా ‘బిగ్ బచత్ ధమాల్ సేల్ 2023’ ను తీసుకొచ్చింది. ఈ సేల్ మార్చి 3 న ప్రారంభమై మార్చి 5న ముగుస్తుంది. ఈ సేల్‌లో వినియోగదారులు వివిధ రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులు, డిస్కౌంట్‌లు పొందవచ్చు. 1,000 కంటే ఎక్కువ బ్రాండ్లు, 1 లక్షకు పైగా ఉత్పత్తులపై 80% వరకు తగ్గింపులు ఉంటాయని కంపెనీ ప్రకటించింది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఫ్యాషన్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలగునవి తక్కువ ధరలో లభించనున్నాయి.
ముఖ్యంగా గృహోపకరణాలపై 75%, టీవీలపై 60% వరకు, ఫర్నిచర్‌పై 70% వరకు, వాషింగ్ మిషన్లపై 60%, ఎయిర్ కండీషనర్‌లపై 55% వరకు తగ్గింపులు ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్ తన వెబ్ పేజీలో పేర్కొంది. Apple, Samsung, POCO, Realme వంటి కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు కూడా తగ్గింపుతో లభిస్తాయి. ఈ సేల్‌లో ప్రత్యేకంగా రూ.54,999 ప్రారంభ ధరతో బైక్‌లు, స్కూటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ ఆఫర్లు ఉన్నాయి.