ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచిన ఫెడరల్ బ్యాంక్

ఫెడరల్ బ్యాంక్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది

Update: 2023-02-18 11:18 GMT

ముంబై: ఫెడరల్ బ్యాంక్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుదల రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న FD లకు వర్తిస్తుంది. పెరిగిన ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంకు పేర్కొన్న వివరాల ప్రకారం.. 7 రోజుల నుండి 2223 రోజులు కాలవ్యవధి డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 3.00% నుండి 6.60% వరకు, అదే సీనియర్ సిటిజన్లకు 3.50% నుండి 7.25% వరకు వడ్డీ రేటు లభిస్తుంది. అత్యధిక వడ్డీ రేటు 15 నెలల నుంచి రెండు సంవత్సరాల వ్యవధిలో సాధారణ ప్రజలకు 7.25%, సీనియర్ సిటిజన్లకు 7.75% గా ఉంది.

Tags:    

Similar News