Bernard Arnault : ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ ఆర్నాల్డ్..!
ఫ్యాషన్ టైకూన్ బెర్నాల్డ్ ఆర్నాల్ట్ ప్రపంచ కుబేరుడిగా మారారు. ఎలాన్ మస్క్ ను అధిగమించి ప్రపంచలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు.
దిశ, బిజినెస్: ఫ్యాషన్ టైకూన్ బెర్నాల్డ్ ఆర్నాల్ట్ ప్రపంచ కుబేరుడిగా మారారు. ఎలాన్ మస్క్ ను అధిగమించి ప్రపంచలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ నివేదికతో ఈ విషయం బయటకు వచ్చింది. ఎల్ విఎంహెచ్ ఛైర్మన్, సీఈవో బెర్నాల్డ్ ఆర్నాల్ట్ సంపాదన 23.6 డాలర్లు పెరగడంతో.. ఆయన కుటుంబానికి చెందిన ఆస్తుల నికర విలువ 207.6 బిలయన్లకు చెరింది. దీంతో అత్యంత ధనవంతుడిగా మస్క్ ను మించిపోయారు. టెస్లా అధినేత మస్క్ నికర విలువ 204.7 డాలర్లు కాగా.. ఆయన రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. మరోవైపు మస్క్ షేర్లు 13 శాతం పడిపోవడంతో.. ఆయనకు 18 బిలియన్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ ఇద్దరు బిలియనీర్ల మధ్య 2022 నుంచి పోటీ నెలకొంది. 2022 ఏడాది చివరన ప్రపంచ కుబేరుడిగా నిలిచారు ఆర్నాల్ట్.
కాగా బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ఇప్పటికీ ప్రపంచ కుబేరుడిగా 199 బిలియన్ డాలర్లతో మస్క్ ఉన్నారు అని పేర్కొంది. రెండో స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 184 బిలియన్ డాలర్లతో ఉన్నారు. 183 డాలర్లతో మూడో స్థానంలో బెర్నాల్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు.
గతేడాది ఏప్రిల్ లో ఆర్నాల్ట్ షేర్లు రికార్డు స్థాయిలో పెరగడంతో..ఆయన సంపద 200 బిలియన్లు దాటింది. ఈ మైలురాయి సాధించిన మూడో వ్యక్తిగా ఆర్నాల్ట్ మారాడు. మస్క్, జెఫ్ బెజోస్ గతంలో ఈ రికార్డుని సాధించారు. లగ్జరీ వస్తువులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఎల్ వీఎంహెచ్ షేర్లు 30 శాతం పెరిగాయి. దీంతో ఆర్నాల్ట్ సంపాదన 2023లో 39 మిలియన్లు పెరిగింది.
ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచలో టాప్ 10 మంది ధనవంతులు వీరే
1. బెర్నాల్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ- 207.6 బిలియన్ డాలర్లు
2. ఎలాన్ మస్క్ – 204.7 బిలియన్ డాలర్లు
3. జెఫ్ బెజోస్- 181.3 బిలియన్ డాలర్లు
4. లారీ ఎల్లిసన్ - 142.2 బిలియన్ డాలర్లు
5. మార్క్ జుకర్‌బర్గ్- 139.1 బిలియన్ డాలర్లు
6. వారెన్ బఫెట్- 127.2 బిలియన్ డాలర్లు
7. లారీ పేజ్- 127.1 బిలియన్ డాలర్లు
8. బిల్ గేట్స్- 122.9 బిలియన్ డాలర్లు
9. సెర్గీ బ్రిన్ - 121.7 బిలియన్ డాలర్లు
10. స్టీవ్ బామర్ - 118.8 బిలియన్ డాలర్లు