Enviro Infra: స్టాక్ మార్కెట్లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చిన ఎన్విరో ఇన్‌ఫ్రా.. ఏకంగా 49 శాతం ప్రీమియంతో లిస్టింగ్..!
ప్రముఖ సీవేజ్ ట్రీట్మెంట్ సొల్యూన్స్ ప్రొవైడర్ ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్(Enviro Infra Engineers) స్టాక్ మార్కెట్లో(Stock Market)అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సీవేజ్ ట్రీట్మెంట్ సొల్యూన్స్ ప్రొవైడర్ ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్(Enviro Infra Engineers) స్టాక్ మార్కెట్లో(Stock Market)అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ఒక్కో ఈక్విటీ షేర్ ధరను సంస్థ గరిష్టంగా రూ. 148గా ఖరారు చేయగా.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(NSE)లో 48.65 శాతం ప్రీమియంతో రూ. 220 వద్ద లిస్ట్ అయ్యింది. ఇక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్(BSE)లో 47.3 శాతం ప్రీమియంతో రూ. 218.60 వద్ద ఆరంగ్రేటం చేసింది. ఇటీవల ముగిసిన ఈ సంస్థ ఐపీఓకు అనూహ్య స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సుమారు రూ. 650 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో ఐపీవోకు రాగా.. ఏకంగా 89.90 రేట్ల సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. మొత్తం 3 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచగా రూ. 276 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల(QIB) కోటా 157.05 రేట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల(Retail Investors) నుంచి 24.48 రేట్ల సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. ఇక నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల(NII) నుంచి 153.80 రేట్ల బిడ్లు ధాఖలయ్యాయి. మరోవైపు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 195 కోట్లను సమీకరించినట్లు ఎన్విరో ఇన్‌ఫ్రా ఇదివరకే వెల్లడించింది. ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో కొంత మొత్తాన్ని మూలధన అవసరాలకు, మిగిలిన నిధుల్ని లోన్స్ పే చేయడానికి, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు సంస్థ తెలిపింది.