"No Choice" ఉద్యోగుల తొలగింపు పై Elon Musk కామెంట్స్
ట్విట్టర్ కొనుగోలు పూర్తి చేసిన తరువాత ఎలాన్ మస్క్ వరుసగా ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగిస్తున్నారు. .Latest Telugu News
న్యూయార్క్: ట్విట్టర్ కొనుగోలు పూర్తి చేసిన తరువాత ఎలాన్ మస్క్ వరుసగా ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగిస్తున్నారు. ఇప్పటికే టాప్ ఎగ్జీక్యూటివ్‌లను తొలగించిన వెంటనే భారత్‌తో పాటు ఇతర దేశాల్లో సగం మందిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల దీనిపై విమర్శలు రావడంతో మస్క్ తాజాగా స్పందించారు.
"కంపెనీ ఇప్పటికే చాలా నష్టాల్లో ఉంది. దురదృష్టవశాత్తూ ట్విట్టర్ రోజుకు 4 మిలియన్లకు పైగా నష్టపోతున్నప్పుడు, ఉద్యోగులను తొలగించడం తప్ప మరో అవకాశం లేదు('నో చాయిస్'). ఉద్యోగం నుంచి తొలగించిన ప్రతి ఉద్యోగికి 3 నెలల జీతం ఇస్తున్నాం. చట్ట ప్రకారం అవసరమైన దాని కంటే 50% ఎక్కువ ఇస్తున్నట్లు " ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ట్విట్టర్‌ను $44 బిలియన్లకు కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్.. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పరాగ్ అగర్వాల్, లీగల్ ఎగ్జిక్యూటివ్ విజయ గద్దె, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, జనరల్ కౌన్సెల్ సీన్ ఎడ్జెట్‌లను తొలగించారు.
కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 7,500 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. అందులో చాలా మందిని ఉద్యోగం నుంచి తొలగించినట్టు వార్తలు వచ్చాయి. భారత్‌లో కూడా 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఇంజినీరింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్ టీమ్‌లలో తొలగింపులు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కంపెనీ జూన్ 30, 2022తో ముగిసిన రెండవ త్రైమాసికంలో $270 మిలియన్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.