వంటనూనె ఎంఆర్‌పీ ధరలను తగ్గించాలని సభ్యులను కోరిన పరిశ్రమ సమాఖ్య!

దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రయోజనం కల్పించే విధంగా వంటనూనె రిటైల్, హోల్‌సేల్ ధరలను తగ్గించాలని పరిశ్రమ సమాఖ్య

Update: 2023-07-24 16:28 GMT

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రయోజనం కల్పించే విధంగా వంటనూనె రిటైల్, హోల్‌సేల్ ధరలను తగ్గించాలని పరిశ్రమ సమాఖ్య సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) తన సభ్యులను కోరింది. గత నెలలో ఆహార మంత్రిత్వ శాఖ, వంటనూనె పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, అంతర్జాతీయంగా తగ్గుముఖం పట్టిన కారణంగా వంటనూనె రిటైల్ ధరలను మరింత తగ్గించాలని నిర్ణయించారు.

తాజాగా జరిగిన రెండో సమావేశంలో మరోసారి ధరల తగ్గింపుపై చర్చించారు. వర్చువల్ సమావేశంలో పడిపోతున్న గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా గత కొన్ని నెలల నుంచి ప్రధాన బ్రాండ్లు ఇప్పటికే ధరలను తగ్గించాయని ప్రభుత్వానికి తెలియజేశాం. ఇంకా తగ్గుతున్న అంతర్జాతీయ మార్కెట్ల ఆధారంగా ఎంఆర్‌పీ, డిస్ట్రిబ్యూటర్ ధరలను తగ్గించాలని సభ్యులను కోరుతున్నామని ఎస్ఈఏ అధ్యక్షుడు అజయ్ ఝున్‌ఝున్‌వాలా సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు.


Similar News